మహిళలకు ఉచిత శిక్షణ
ప్రకాశం జిల్లా ఒంగోలులోని రూడ్సెట్ కార్యాలయంలో ఈనెల 24 నుంచి నిరుద్యోగ మహిళలకు ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన, ఆధార్, రేషన్ కార్డు కలిగిన మహిళలు అర్హులు. శిక్షణ సమయంలో భోజన, వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పించబడతాయి. మరిన్ని వివరాలకు ఒంగోలులోని రూడ్సెట్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
