ఒంగోలులోని కేవీయస్ బార్‌లో మద్యం సేవించి, స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరిపై బీరు బాటిళ్లతో దాడి జరిగింది. ఈ నెల 23న జరిగిన ఈ ఘటనలో అజయ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణ జరిగిన తర్వాత కూడా ఒక యువకుడు నింపాదిగా మద్యం సేవించి వెళ్లడం సీసీటీవీలో రికార్డయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.