కందుకూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. డిసెంబర్ 31 నుంచి కందుకూరు ప్రకాశం జిల్లాలోనే కొనసాగుతుంది. గత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపింది. దీనికి నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఎన్నికల్లో కందుకూరును ప్రకాశంలో కలుపుతామని చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. దీంతో ఇక్కడి ప్రజల ఆకాంక్ష ఫలించింది.