ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి నిధులు విడుదల.. ఎమ్మెల్యే హర్షం

1చూసినవారు
ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి నిధులు విడుదల.. ఎమ్మెల్యే హర్షం
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా, కొత్తపట్నం మండలం కె. పల్లెపాలెం వద్ద ప్రతిష్ఠాత్మక ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 441.88 కోట్ల నిధులను మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ నిధుల విడుదలపై ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ద్వారా ఎందరికో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్