ప్రకాశం జిల్లాలోని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. గురువారం బంద్ సందర్భంగా ఒంగోలులోని పలు కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఈ విశ్వవిద్యాలయం వెనుకబాటుతనంలో ఉందని, వెంటనే నిధులు కేటాయించి అభివృద్ధి పథంలోకి నడపాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.