ప్రకాశం జిల్లా ఒంగోలులో సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు దొంగలు రెచ్చిపోయారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి మెడలోని బంగారు గొలుసులను దొంగిలించారు. సాయిబాబా గుడి, అయ్యప్ప స్వామి గుడి సమీపంలో ఇద్దరు మహిళల మెడలో నుంచి గొలుసులు చోరీ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు ద్విచక్ర వాహనంపై వచ్చినట్లు స్థానికులు తెలిపారు.