సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలపై రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం జరుగుమల్లిలో నిర్వహించిన 2వ రోజు మహానాడు వేడుకల్లో సత్య మాట్లాడారు. మంత్రి స్వామికి, తనకు మధ్య విభేదాలు ఉన్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నవారిపై మండిపడ్డారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చే పనులు తాను ఎప్పుడూ చేయనని స్పష్టం చేశారు.