ఢిల్లీలో జరిగిన పేలుళ్ల ఘటనల నేపథ్యంలో, ప్రకాశం జిల్లావ్యాప్తంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు సోమవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలో హై అలర్ట్ ప్రకటించి, అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.