ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్డీవోగా లక్ష్మీ ప్రసన్న బుధవారం తన బాధ్యతలు స్వీకరించారు. జిల్లాల విభజన నేపథ్యంలో అద్దంకిని ప్రకాశం జిల్లాలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నియామకం జరిగింది. అద్దంకి శాసనసభ్యులు, ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభ్యర్థన మేరకు సీఎం చంద్రబాబు అద్దంకిని ప్రకాశం జిల్లాలో చేర్చారు. దీంతో డివిజన్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఈ బాధ్యతలు స్వీకరించారు.