కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్సు రద్దు

3చూసినవారు
పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతను సృష్టించే పెట్రోల్ బంకుల లైసెన్సులు రద్దు చేస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 195 బంకులను నిరంతరం పరిశీలిస్తున్నామని, సివిల్ సప్లై అధికారి, పోలీస్ అధికారి, వీఆర్వోలు పెట్రోల్, డీజిల్ వాహనదారులకు అందేలా చూస్తున్నారని తెలిపారు. గుంటూరు, కృష్ణ, పల్నాడు జిల్లాలలో కొరత ఉందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తల కారణంగా ప్రజలు బల్క్ లో కొనుగోలు చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, అయితే ఎక్కడా కొరత లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్