లారీ డ్రైవర్ పై దాడి, ఆపై దోపిడి

0చూసినవారు
లారీ డ్రైవర్ పై దాడి, ఆపై దోపిడి
ఒంగోలు శివారులోని ఆలాస్ హోటల్ వద్ద మంగళవారం లారీ డ్రైవర్‌పై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేసి, బెదిరించి, అతని వద్ద ఉన్న రూ. 2వేల నగదును దోచుకొని పరారయ్యారు. వలేటివారిపాలెంనకు చెందిన శ్రీనివాసరావు చెన్నయ్ వెళుతూ బహిర్భూమికి వెళ్లేందుకు లారీని ఆపినప్పుడు ఈ సంఘటన జరిగింది. బాధితుడు ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్