ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం త్రోవగుంట గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని మినీ లారీ ఢీకొన్న ఘటనలో అరవ కాలనీకి చెందిన లోకేష్ అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరారీ అయ్యాడు.