ప్రకాశం జిల్లా రాజకీయ కేంద్రమైన ఒంగోలులో టీడీపీ పార్లమెంట్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి బుధవారం అత్యంత వైభవంగా భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే ఉగ్రతోపాటు పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. ఇది టీడీపీకి మరో చారిత్రక ఘట్టంగా నిలిచింది.