పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

7చూసినవారు
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా ఒంగోలులోని 12వ డివిజన్ మరాఠీపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నేరుగా పెన్షన్లు అందించారు. వితంతు, వృద్ధాప్యం, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచి, వాటిని సకాలంలో అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నూకసాని బాలాజీ, షేక్ రియాజ్, మేయర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్