హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జూన్ 3వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఒక ప్రైవేటు సంస్థ ఎన్టీఆర్ అవార్డ్స్ పేరుతో విద్యార్థులను సన్మానించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లను ఆహ్వానించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. బాలకృష్ణ రాకతో జిల్లాలో సందడి నెలకొనే అవకాశం ఉంది.