ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సోమవారం సాయంత్రం ట్రాఫిక్ ఎస్సై శివప్రసాద్ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆటోలను ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించేలా ఇష్టారీతిన నిలుపుదల చేయరాదని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, యూనిఫామ్ తప్పనిసరిగా వేసుకోవాలని ఆయన సూచించారు.