ఒంగోలులోని పోతురాజుపాలెం బాలాజీ నగర్ మున్సిపల్ హైస్కూల్ పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇ. మోహన్ చంద్ 563 మార్కులతో పాఠశాల టాపర్‌గా నిలిచాడు. మొత్తం 32 మంది
విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 31 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఐదుగురు
విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించి పాఠశాల గౌరవాన్ని పెంచారు. ఈ
ఫలితాలు విద్యార్థుల కృషికి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వానికి నిదర్శనంగా నిలిచాయి.