ఒంగోలు: మొత్తం 94 ఫిర్యాదులు

51చూసినవారు
ఒంగోలు: మొత్తం 94 ఫిర్యాదులు
ఒంగోలులో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో మొత్తం 94 ఫిర్యాదులు అందాయని ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ దామోదర్ ఆదేశాలతో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలపై ఎస్పీకి అర్జీలు ఇచ్చినట్లుగా అధికారులు తెలిపారు. సంబంధిత పోలీసు సిబ్బందితో మాట్లాడి ప్రజలు ఇచ్చిన అర్జీల సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ దామోదర్ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్