ఒంగోలు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

2చూసినవారు
ఒంగోలు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం త్రోవకుంట సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో మహిళ బస్సు వెనుక టైర్ కింద పడి అక్కడికక్కడే మరణించింది. మృతురాలు ముక్తినూతలపాడుకు చెందిన చిన్నమ్మ అని స్థానికులు గుర్తించారు. పోలీసులు సమాచారం అందుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్