ప్రకాశం జిల్లాలో పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుక్రవారం ఒంగోలులోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించి పరిశీలించారు. ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన 193 మంది ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లు ఈనెల 22 నుంచి ఇక్కడ శిక్షణ పొందనున్నారు. వారికి కల్పించే వసతులపై ఎస్పీ ఆరా తీశారు.