పెద్దదోర్నాల: పంట దెబ్బతిందని ఆత్మహత్యాయత్నం

0చూసినవారు
పెద్దదోర్నాల: పంట దెబ్బతిందని ఆత్మహత్యాయత్నం
మొంథా తుపాను కారణంగా తన ఏడు ఎకరాల మిర్చి పంట పూర్తిగా నష్టపోవడంతో మనస్తాపానికి గురైన కటకానిపల్లెకు చెందిన యువ రైతు దూదేకుల రసూల్ శుక్రవారం పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే ఉన్న బంధువులు ఆయనను వారించి, మందు డబ్బాను లాక్కోవడంతో ప్రాణాపాయం తప్పింది. తీవ్రంగా పంట నష్టపోయినా అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల వల్ల అనేక మంది రైతులు పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.