ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని 39వ వార్డులో వీధి కుక్కలు రెచ్చిపోయి ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఆదివారం ఇద్దరు వ్యక్తులపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. కొద్దిరోజులుగా తమ ప్రాంతంలో వీధి కుక్కలు సంచరిస్తూ ప్రజలను వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని సంబంధిత అధికారులు పట్టించుకోని వీధి కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కుక్కల దాడితో ప్రజలు గాయపడుతున్నట్లు వారు వాపోయారు.