ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి విజిబులింగ్ పోలీస్ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఉండే ప్రాంతాలపై దృష్టి సారించి, దొంగతనాలను అరికట్టేందుకు రాత్రివేళల్లో భద్రతను పటిష్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలు ప్రజల భద్రతకు దోహదపడతాయని భావిస్తున్నారు.