మంగళగిరి
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజులపాటు జరుగుతున్న మహానాడులో తొలిరోజు పార్టీకి రూ. 11 కోట్లు విరాళాలు అందాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రూ. 1.50 కోట్లు, రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య రూ. 20 లక్షలు విరాళం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలిసారి వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహిస్తున్నారు.