నాలుగు సంవత్సరాల క్రితం టంగుటూరు మండలంలోని బంగారు దుకాణంలో దొంగతనం చేసిన కేసులో ఒంగోలు కోర్టు శుక్రవారం ఇద్దరు దొంగలకు శిక్ష విధించింది. శివకోటయ్యకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 3 వేల జరిమానా, నరేష్‌కు 8 నెలల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసులో దొంగలకు శిక్ష పడేలా చేసిన పోలీసులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.