ఉమ్మడి ప్రకాశం జిల్లా కు వర్ష సూచన

8చూసినవారు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. జిల్లాలో ఇప్పటికే ఆకాశం మేఘావృతమై ఉంది. సముద్రం ఆటుపోట్లు సాధారణంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. అయితే, తుఫాను తీవ్రతపై రెండు రోజుల తర్వాత స్పష్టత వస్తుందని తెలిపారు. జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్