ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో 'కలెక్టర్ మీకోసం' కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా భూ సమస్యలపై అధికంగా అర్జీలు వచ్చినట్లు సమాచారం. అర్జీదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.