ఒంగోలులో ఆరు నీట్ పరీక్ష కేంద్రాలు

1170చూసినవారు
ఒంగోలులో ఆరు నీట్ పరీక్ష కేంద్రాలు
ప్రకాశం జిల్లా ఒంగోలులో వచ్చే నెల 3న నీట్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ పి. రాజాబాబు ఆదేశించారు. నగరంలోని 6 కేంద్రాల్లో 1,728 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని, అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్