ఒంగోలు పట్టణంలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన 5కే రన్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, అనంతరం పోలీసు సిబ్బంది, విద్యార్థులతో కలిసి పరుగులో పాల్గొన్నారు. మహానుభావుల అడుగుజాడలు అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా ఎస్పీ కొనియాడారు.