ఏపీలో మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు 'స్పీడ్ ట్రయల్ మానిటరింగ్' విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. గృహ హింస, పోక్సో వంటి కేసుల నియంత్రణకు శక్తి కార్యక్రమాల్లో భాగంగా 'ఆపరేషన్ దండాయన'ను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సత్వర విచారణ ద్వారా నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చూడటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ వివరించారు.