ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ప్రైవేట్ కళాశాల వార్షికోత్సవంలో శనివారం ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, ఎంపీ మాగుంట సైతం వారితో కలిసి డాన్స్ చేసి ఉత్సాహాన్ని నింపారు. అనంతరం విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.