తెలుగుదేశం పార్టీ తమపై దుష్ప్రచారం చేస్తుంది

5చూసినవారు
రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని తెలుగుదేశం పార్టీ తమపై దుష్ప్రచారం చేస్తుందని మాజీ టీటీడీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ, పెట్టుబడుల కోసం రాష్ట్రానికి సంస్థలు వస్తుంటే తాము అడ్డుకోబోమని, అయితే భూములను తక్కువ ధరలకు కంపెనీలకు ఇవ్వడం మంచి పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ హయాంలోనే గూగుల్ డేటా సెంటర్కు బీజం పడిందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్