విద్యార్థుల పట్ల వార్డెన్ ప్రత్యేక శ్రద్ధ

2చూసినవారు
విద్యార్థుల పట్ల వార్డెన్ ప్రత్యేక శ్రద్ధ
సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం నుంచి సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, దొనకొండలోని బాలుర సాంఘిక సంక్షేమ హాస్టల్ -1 వార్డెన్ జి. మంత్రు నాయక్, దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం శుక్రవారం హాస్టల్లోనే బస చేసి, శనివారం ఉదయం టిఫిన్ తిని వెళ్లాలని సూచించారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎన్. లక్ష్మా నాయక్ శుక్రవారం రాత్రి హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థుల భద్రత, ప్రయాణ సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిన వార్డెన్ ను అభినందించారు. ఆయన హాస్టల్ లోని సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు, పారిశుధ్యం, వంటగది, స్టోర్ రూమ్, తాగునీటి వసతులను పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ హాస్టల్లో 200 మంది విద్యార్థులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్