ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మారుతి నగర్ లో మనస్పర్దాల కారణంగా ఓ మహిళ తన భర్తపై హత్యాయత్నం చేసింది. గురువారం తెల్లవారుజామున భర్త ఇంట్లో నిద్రిస్తుండగా, భార్య అతనిపై పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టింది. అనంతరం తాలూకా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భర్త ప్రాణాలతో బయటపడటాన్ని నిర్ధారించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో భార్యాభర్తలిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు.