ఒంగోలులోని పాత జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో శుక్రవారం, ప్రకాశం, మార్కాపురం జిల్లాల డేటా ఎంట్రీ ఆపరేటర్లతో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఇంటి పన్నులు, ఇతర వివరాలను పోర్టల్లో తప్పక నమోదు చేయాలని, డేటా ఎంట్రీలో ఖచ్చితత్వం పాటించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో డేటా నమోదు ప్రక్రియపై ఆయన పలు సూచనలు చేశారు.