ఒంగోలు పట్టణం కర్నూల్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో ప్రేమించిన యువతి మాట్లాడటం లేదన్న మనస్తాపంతో మారం వెంకట మహేంద్ర రెడ్డి (24) అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహేంద్ర రెడ్డి స్వగ్రామం దొనకొండ మండలం తెల్లబాడు. అయన అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.