శనివారం ఒంగోలులోని దశరాజుపల్లి గేటు సమీపంలో ఒక యువకుడు రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు లైటుబ్లూ చొక్కా, నలుపు కట్ బనియన్, బులుగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. అతని తలకు గుండు చేసి ఉంది, కుడిచేతిపై అర్థచంద్రాకారంలో చుక్క, బొడ్డుకు కుడి పక్కన పుట్టుమచ్చ ఉన్నాయని రైల్వే ఎస్ఐ శ్రీరామ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.