
సమస్యల పరిష్కారానికి కలెక్టర్ని కలిసిన ఎమ్మెల్యే
గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ రాజాబాబును కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిసి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను వివరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.





































