Feb 12, 2026, 02:02 IST/
భారీగా తగ్గిన టమాటా ధరలు.. రూ.50కే 4 కేజీలు
Feb 12, 2026, 02:02 IST
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్లో 4 కేజీల టమాటాలు కేవలం రూ.50కే లభిస్తున్నాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రైతులకు కేజీకి కేవలం రూ.5 మాత్రమే దక్కుతుండటంతో, వారు పంటను రోడ్లపై పడేస్తున్నారు. మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. ఇదే సమయంలో ఉల్లిపాయల ధరలు కూడా తగ్గి కేజీ రూ.30 వరకు పలుకుతున్నాయి.