Feb 07, 2026, 07:02 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
ఆదివాసీ యువత మానవత్వం: పేదలకు అండగా నిలిచిన సాలేగూడ యువజన సంఘం
Feb 07, 2026, 07:02 IST
కాసిపేట మండలం సాలేగూడ గ్రామానికి చెందిన ఆడే లచ్చు కిడ్నీ రాళ్లు, మూత్ర విసర్జన సమస్యతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేక వరంగల్ వెళ్లలేకపోయారు. సాలేగూడ ఆదివాసీ యూత్ సభ్యులు రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. అలాగే, అనాథ అయిన అర్క ఝాన్సీ లక్ష్మి వివాహానికి సాలేగూడ ఆదివాసీ యూత్ మహిళా సభ్యులు ఆర్థిక సహాయంతో పాటు కుర్చీలు, టెంట్లు, నిత్యవసర సరుకులు అందజేశారు. వారి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామస్థులు అభినందించారు.