
అదుపుతప్పి కారు బోల్తా
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కోష్టాల్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి అద్దంకి వైపు వెళ్తున్న కారు, మార్గమధ్యంలో బైకును తప్పించబోయి అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి కరెంట్ స్తంభాలను ఢీకొని బోల్తా పడింది. కారులోని ప్రయాణికులను స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనతో కొద్దిసేపు రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.







































