ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 563 మార్కులు

1136చూసినవారు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 563 మార్కులు
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని కామేపల్లివారిపాలెం గ్రామానికి చెందిన ఇస్తర్ల లిఖిత, పదో తరగతి పరీక్షల్లో 563 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. లిఖిత మద్దిపాడు మండలం లింగంగుంట ప్రభుత్వ పాఠశాలలో చదివింది. ఆమె విజయం సాధించడంతో గ్రామస్థులు ఆమెను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్