ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొష్టాలు సెంటర్లో శనివారం రాత్రి లారీ డ్రైవర్ కృష్ణమోహన్ తన లారీలోంచి రూ. లక్ష చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ నుంచి మదనపల్లికి వెళ్తున్న క్రమంలో మద్దిపాడు వద్ద లారీ నిలిపి నిద్రపోతున్న సమయంలో ఈ చోరీ జరిగినట్లు బాధితుడు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.