చీమకుర్తి మండలం పాటిమీదపాలెం గ్రామానికి చెందిన ప్రేమజంట పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. డిగ్రీ పూర్తిచేసి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న యువకుడు, అదే గ్రామానికి చెందిన యువతి ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. కుటుంబ పెద్దలు వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన వీరిద్దరూ, సంతనూతలపాడు మండలం ఎండ్లూరుడొంక వద్ద నీటి కుంటలో పురుగుమందు తాగి దూకారు. లోతు తక్కువగా ఉండటంతో స్థానికులు గుర్తించి వారిని ఒంగోలు వైద్యశాలకు తరలించారు.