చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో సోమవారం జరిగిన ఘర్షణ కుల గొడవ కాదని పోలీసులు స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వ్యక్తిగత వివాదమే ఈ ఘర్షణకు దారితీసిందని, దీనిలో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయని, వారిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారని మంగళవారం విచారణ అనంతరం పోలీసులు తెలిపారు.