అమ్మనబ్రోలులో భారీ అగ్ని ప్రమాదం
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక పాత సినిమా థియేటర్ పక్కన ఉన్న పాత ఇనుము దుకాణం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో షాపులోని ప్లాస్టిక్ సామాన్లు, వాటిని రీసైక్లింగ్ చేసే రెండు మిషన్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని దుకాణం యజమాని తెలిపారు.
