సంతనూతలపాడు ఎంపీడీవో సురేశ్ బాబు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన 'కిషోరి వికాసం సమ్మర్ స్పెషల్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో కిషోరీ బాలబాలికలు మంచి పరివర్తనతో పాటు, బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి సూచించారు.