ప్రకాశం జిల్లా చీమకుర్తి మైనింగ్ డంపింగ్ లో మంగళవారం ఒక టిప్పర్ లారీ అగ్నికి ఆహుతైంది. ట్రక్కు వస్తున్నప్పుడు పైనున్న కరెంటు తీగ తగలడంతో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. స్థానికులు వెంటనే మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.