చీమకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంఈఓ నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మేనేజ్ మెంట్ కమిటీలు అభివృద్ధి కొరకు సహకరించాలని తెలిపారు. పాఠశాలల అభివృద్ధి కొరకు చర్చించి అభివృద్ధి పరచాలన్నారు. చదువుతోపాటు పరిసరాలు కూడా విద్యార్థులకు ఎంత అవసరమని పేర్కొన్నారు.