నాగులుప్పలపాడు వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. మట్టిగుంట గ్రామానికి చెందిన స్వర్ణ కృష్ణయ్య, చీరాలకు చెందిన సోమేశ్వరావు తహసీల్దార్ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనంపై 216 రహదారిపైకి వస్తుండగా, చీరాల వైపు వెళుతున్న కారు అదుపుతప్పి వారిని ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఒంగోలులోని హైవే ఆంబులెన్స్‌లో తరలించారు.